మెగాస్టార్ మూవీకి తెలుగు ఆడియన్స్ నుండి కూడా అదే రెస్పాన్స్

మెగాస్టార్ మూవీకి తెలుగు ఆడియన్స్ నుండి కూడా అదే రెస్పాన్స్

Published on Feb 24, 2024 9:33 PM IST


మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ హర్రర్ థ్రిల్లింగ్ మూవీ భ్రమయుగం. నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌, వైనాట్‌ స్టూడియోస్‌ సంస్థల పై ఈ మూవీని రాహుల్ స‌దాశివ‌న్ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించగా అర్జున్ అశోక‌న్‌, సిద్ధార్థ్ భ‌ర‌త‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సినిమా మొత్తంలో ఈ ముగ్గురు మాత్ర‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తారు.

అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్ లో రూపొందిన ఈ మూవీ ఇటీవల మలయాళంలో రిలీజ్ అయి పెద్ద సక్సెస్ సాధించింది. విషయం ఏమిటంటే, నిన్న తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ మూవీకి ఇక్కడి ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుండడంతో టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది. మమ్ముట్టి మరొక్కసారి విభిన్న పాత్రలో తన అత్యద్భుత యాక్టింగ్ తో ఆడియన్స్ ని అలరించిన ఈ మూవీ రాబోయే రోజుల్లో ఎంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు