డీసెంట్ ఎంటర్టైనింగ్ “సమ్మతమే” ట్రైలర్.!

Published on Jun 16, 2022 8:00 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా మరో తెలుగు యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “సమ్మతమే”. దర్శకుడు గోపినాథ్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ కి సిద్ధం అవుతుండగా మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కట్ ని రిలీజ్ చేశారు.

అయితే ఇది మాత్రం మంచి ఎంటర్టైనింగ్ గా డీసెంట్ గా ఉందని చెప్పాలి. తన చిన్నప్పుడు నుంచి పెళ్లి కోసం ఎదురు చూసే డీసెంట్ యువకుడిగా కిరణ్ అబ్బవరం సెటిల్డ్ రోల్ లో కనిపిస్తున్నాడు. అలాగే హీరోయిన్ చాందిని చౌదరితో అయితే ఇద్దరి మధ్య సీన్స్ లో మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది.

ఇద్దరూ కూడా స్క్రీన్ పై మంచి ప్రెజెన్స్ తో కనిపిస్తుండగా సినిమాలో ప్రామిసింగ్ ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టు అర్ధం అవుతుంది. ఆలాగే ఇద్దరి మధ్య కాన్ఫిల్ట్ తో మంచి ఎమోషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇలా మంచి ఎమోషన్స్ మరియు ప్రామిసింగ్ ఎంటర్టైన్మెంట్ తో ఈ ట్రైలర్ డీసెంట్ గా అనిపిస్తుంది.

అలాగే ఈ ట్రైలర్ లో చూసినట్టు అయితే శేఖర్ చంద్ర ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి ప్లస్ అయ్యింది, అలాగే డైలాగ్స్ బాగున్నాయి. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ కూడా సినిమాలో బ్యూటిఫుల్ గా ఉండేలా కనిపిస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ జూన్ 24 వరకు ఆగాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :