మాస్ మహారాజ రవితేజ ‘పవర్’ సినిమా సక్సెస్ తర్వాత వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ఇప్పటికే సూపర్ హిట్ మూవీ ‘కిక్’ సీక్వెల్ అయిన ‘కిక్ 2’ సినిమాని మొదలు పెట్టాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇది సెట్స్ పై ఉండగానే ఇటీవలే సంపత్ నంది డైరెక్షన్ లో ఓ సినిమా చెయ్యడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇదివరకే తెలియజేశాం.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం సంపత్ నంది, అతని టీం ఈ సినిమా కోసం ‘బెంగాల్ టైగర్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి, కథకి ఈ టైటిల్ బాగా సరిపోతుందని ఈ చిత్ర టీం భావిస్తోంది. అలాగే ఇదే టైటిల్ ని ఫైనలైజ్ చెయ్యాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఈ మూవీలో రవితేజ సరసన తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది.
ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘కిక్ 2’ షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. రవితేజ నటిస్తున్న కిక్ 2 ని 2015 సమ్మర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
