‘సంపూర్ణ భగవద్గీత’ ఆడియో ఆవిష్కరణ

Sampoorna-geeta
తిరుమల తిరుపతి దేవస్థానముల ఆశీస్సులతో భగవద్గీతా ఫౌండేషన్‌ సమర్పణలో ప్రముఖ సినీ గాయకుడు, సంగీత దర్శకుడు గంగాధర శాస్త్రి ప్రారంభించిన ‘సంపూర్ణ భగవద్గీతా గాన యజ్ఞం’ను 18 ఆడియో సీడీ రూపంలో రూపొందించారు. భారతదేశ సంగీత చరిత్రలో ప్రప్రథమంగా, ప్రతిష్టాత్మకంగా, ప్రామాణికంగా అనదగిన శబ్ద వాగ్మయమే గంగాధర శాస్త్రి ఆపించిన 700 శోక్లా తాత్సర్య సహిత సంపూర్ణ భగవద్గీత. ఘంటసాల వంటి ప్రముఖ తెలుగు గాయకుడు ప్రారంభించిన గీతా గాన యజ్ఞాన్ని మరొక తెలుగువాడు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో గంగాధరశాస్త్రి చేసిన అపూర్వ ప్రయత్నమిది. గంగాధర శాస్త్రి స్వీయ సంగీత సారథ్యంలో తాత్వర్య సహితంగా తెలుగులో 700 శ్లోకాల సంపూర్ణ గీతాగాన యజ్ఞాన్ని ప్రారంభించి 7 సంవత్సరా నిరంతర కృషితో ఈ ఆడియో రూపొందించారు. ఈ సంపూర్ణ భగవద్గీత ఆడియో విడుద కార్యక్రమం జూలై 29న హైదరాబాద్‌లోని శ్పికళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో

ప్రముఖ పీఠాధిపతులు విశ్వేశ్వర తీర్థస్వామి, విద్యారణ్య భారతి స్వామి, కమలానంద భారతి స్వామి, పరిపూర్ణానంద స్వామితో పాటు మాజీ పార్లమెంట్ సభ్యుడు కనుమూరి బాపిరాజు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, శాంతా బయోటిక్స్‌ అధినేత కె.వరప్రసాద్‌ రెడ్డి, సన్‌ షైన్‌ హాస్పిటల్స్‌ గురవా రెడ్డి, కె.విశ్వనాథ్‌, పుల్లె గోపిచంద్‌,పి.వి.ఆర్‌.కె.ప్రసాద్‌, కిషన్‌రావు, ఎల్‌.వి.సుబ్బారెడ్డి, ఎస్‌.జానకి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడియో సీడీలను విశ్వేశ్వర తీర్థానంద స్వామి విడుద చేసి తొలి సీడీని మాజీ పార్లమెంట్‌ సభ్యు కనుమూరి బాపిరాజుకి అందించారు. పబ్లిక్‌ కాపీని పరిపూర్ణానంద స్వామి విడుద చేసి తొలి కాపీని టి.సుబ్బరామిరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా…

మానవుడు తన కర్తవ్యాన్ని నిష్కామ కర్మతో ఎలా చేయాలో, ఎందుకు చేయాలో ఈ భగవద్గీతలో భగవంతుడు కృష్ణడు, అర్జునుడి రూపంలోని సమస్త మానవాళికి వివరించారు. మన దేశంలో గీత, గంగ, గాయత్రి, గోమాత, గురు, గోవింద అనేవి మన సంస్కృతికి ప్రతీకలు. ఇటువంటి గొప్ప కార్యాన్ని కఠోర దీక్షతో పూర్తి చేసి ఆడియో రూపంలోకి తీసుకువచ్చి గీత గంగాధర శాస్త్రి అయ్యారు. ఆయనకు దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని విశ్వేశ్వర తీర్థస్వామి అన్నారు. భగవంతుడు మనకు ఏదీచ్చినా మన అర్హతను బట్టే ఉంటుంది. అందుకు అర్హతతో పాటు ప్రయత్నం, అనుగ్రహం కావాలి. ఈ మూడు పూర్తిగా ఉన్నవాడు గంగాధర శాస్త్రి. చాలా కష్టపడి ఈ ప్రయత్నాన్ని పూర్తి చేశాడు. ఇది ప్రతి విద్యార్థి చేతిలో ఉండాల్సిన పుస్తకం, ప్రతి తరగతి పుస్తకంలో ఉండాల్సిన సంపుటం. దీన్ని ప్రతి భారతీయుడు తన దగ్గర ఉంచుకోవాల్సిన గ్రంథమని గౌరవ అధ్యక్షుడు పి.వి.ఆర్.కె.ప్రసాద్ అన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు

భగవద్గీతను మంచి మెనేజ్‌మెంట్‌ గ్రంథంగా అందరూ ఆచరిస్తున్నారు. ఈ గ్రంథాన్ని మన దగ్గర ఉంచుకోవడం కాదు, ఆచరించాలి. జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఇందులో భగవంతుడు వివరించారని విద్యారణ్య భారతి స్వామి అన్నారు. కుల మత ప్రాంతాలకతీతంగా సకల మానవాళిని క్షేమాన్ని కాంక్షించిన దేశమిది. 700 శ్లోకాలను వింటుంటే దర్శించామనే అనుభూతి కుగుతుంది. ఏడేళ్ల కృషి ఫలితమిది. నా తల్లి ఒడిలో అన్నమయ్య పాట, నా తండ్రి గుండెపై ఘంటసా పాటే ఈ రోజు నన్ను ఈరోజు ఈ సంపూర్ణ భగవద్గీత మార్గంలోకి నడిపించాయి. అర్జునుడి నిమిత్తంగా చేసుకుని కృష్ణ పరమాత్ముడి చేసిన జ్ఞానపదేశమే భగవద్గీత. ఘంటసాలగారు భగవద్గీతను పారాయణం చేసిన తర్వాత లోకమంతా ఈ భగవద్గీత వైపు చూసింది. ప్రతి ఇంటా వివేకానందులను సృష్టించడమే భగవద్గీత లక్ష్యం. ఘంటసాలగారి స్ఫూర్తితోనే ఈ భగవద్గీతను పూర్తి చేశాను. ఆయనకు ఈ భగవద్గీతను అంకితం చేస్తున్నాను. ఎంతో మంది గొప్ప వ్యక్తులు, జ్ఞానులు అందించిన సపోర్ట్ తోనే ఈ భగవద్గీతను పూర్తి చేయగలిగాను అని గంగాధర శాస్త్రి అన్నారు. భగవద్గీతను తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీషు, జర్మన్‌, రష్యన్‌, ఫ్రెంఛ్‌, జపనీస్‌ భాషల్లో కూడా సీడీలుగా విడుద చేయాలని గంగాధర శాస్త్రి స్థాపించిన ‘భగవద్గీత ఫౌండేషన్‌’ కృషి చేస్తోంది.