సునామీ వస్తుంది సిద్ధంగా ఉండమంటున్న సంపూ.. క్యాలీఫ్లవర్ ట్రైలర్ నేడే..!

Published on Nov 20, 2021 3:01 am IST


బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్’ శీలో రక్షతి రక్షితః.. అన్నది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంపూ సరసన వాసంతి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం ఓ ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. నవంబర్ 20 అనగా నేడు ఉదయం 9:09 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ప్రజ్వల్‌ అద్బుతమైన సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం :

More