న్యాచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది పారడైజ్’(The Paradise) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తెరకెక్కిస్తుండగా పూర్తి మాస్ ట్రీట్మెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూస్తే అర్థమవుతుంది.
‘బిర్యాని’గా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు..
అయితే, ఈ సినిమాలో మిగతా పాత్రలను కూడా అదే రీతిలో చూపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాలో బిర్యాని(Biryani) అనే పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఓ సాలిడ్ పోస్టర్ రిలీజ్ చేశారు. బిర్యాని పాత్రలో సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) నటిస్తున్నారు. రక్తపు చేతులతో గొడ్డలి పట్టుకుని బీడి కాలుస్తూ టెర్రిఫిక్ లుక్‌తో సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌తో ఈ సినిమాలో ఆయన ఎలాంటి మాస్ ట్రీట్ ఇవ్వనున్నాడో అర్థమవుతుంది.
మిగతా పాత్రలపై పెరిగిన అంచనాలు
ఈ ఒక్క పోస్టర్‌తో ‘ది పారడైజ్’(The Paradise) సినిమాలోని మిగతా పాత్రలపై అమాంతం అంచనాలు పెరిగేలా చేశారు. ఇక ఈ సినిమాలో మిగతా క్యాస్టింగ్‌లో నటి సోనాలి కుల్కర్ణి(Sonali Kulkarni) ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను 2026 మార్చి 26న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.
