కాస్త ముందుగానే డిజిటల్ ప్రీమియర్ కి “సామ్రాట్ పృథ్వీరాజ్”

Published on Jun 12, 2022 8:55 pm IST


బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, స్టార్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా సామ్రాట్ పృథ్వీరాజ్ బాక్సాఫీస్ వద్ద అనుకున్న రీతిలో ఆకట్టుకోలేదు. పేలవ ప్రదర్శన తో వసూళ్లను రాబట్టడం లో విఫలం అయింది. కాబట్టి, యష్ రాజ్ ఫిల్మ్స్ ఇతర మార్గాల్లో డబ్బు సంపాదించడానికి మార్గాలను అన్వేషిస్తోంది. తాజా గాసిప్ ఏమిటంటే, అధిక బడ్జెట్ మరియు అధిక ఆన్ VFX చిత్రం మరికొన్ని రోజుల్లో డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది అని తెలుస్తోంది.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచినందున, థియేట్రికల్ విడుదలైన 3 నుండి 4 వారాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి, సినిమా మరో 2 నుండి 3 వారాల్లో ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ కి రావచ్చు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ప్రైమ్ వీడియో నుండి రావాల్సి ఉంది. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్, సోనూ సూద్, సంజయ్ దత్, అశుతోష్ రానా ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :