రానాకు భార్యగా ఆ హీరోయిన్‌ని ఖన్‌ఫామ్ చేశారా?

Published on Sep 18, 2021 2:57 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని సాగర్ కె చంద్ర “భీమ్లా నాయక్‌” పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకి చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన పవన్ కళ్యాణ్ టీజర్‌కు, టైటిల్ సాంగ్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుంది.

ఇకపోతే ఈ సినిమాలో రానా ‘డానియల్ శేఖర్’ పాత్రలో పవర్ ఫుల్ విలన్‌గా కనిపించనున్నారు. సెప్టెంబర్ 20వ తేదిన రానా పాత్రకి సంబంధించిన ఒక అప్డేట్‌ని విడుదల చేయనున్నట్టు తాజాగా తెలిపారు. ఇక ఈ సినిమాలో ప‌వ‌న్ కళ్యాణ్‌కు జోడీగా నిత్య‌మీన‌న్ నటిస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే రానాకు జోడీగా ఐశ్వ‌ర్య రాజేశ్ నటిస్తున్నట్లు ముందు నుంచి వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు రానాకు భార్య పాత్రలో మరో నటి పేరు తెరపైకి వచ్చింది. మ‌ల‌యాళం న‌టి సంయుక్తా మీన‌న్ రానాకు భార్య‌గా క‌నిపించ‌నుందని, ఇటీవల చిత్రబృందం ఆమెను సంప్రదించగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందట.

సంబంధిత సమాచారం :