గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ కొల్ల డైరెక్ట్ చేయగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పుడు అందరి చూపు బాలయ్య నెక్స్ట్ మూవీ పై పడింది. ఇప్పటికే మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య ‘అఖండ 2’ మూవీని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘అఖండ’కు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ‘అఖండ 2 – తాండవం’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. కాగా, ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో అందాల భామ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ కూడా వారు రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమా తొలి భాగంలో మరో బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ సీక్వెల్ మూవీగా ప్రగ్యా జైస్వాల్ స్థానంలో సంయుక్త జాయిన్ అయ్యిందా… లేక సంయుక్త మీనన్ మరో హీరోయిన్‌గా పరిచయం కానుందా అనేది ఈ సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25, ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.