భారీ స్థాయిలో విడుదలకానున్న విశాల్ ‘పందెంకోడి 2’ !

యాక్షన్ హీరో విశాల్, కీర్తి సురేష్ జంటగా లింగు సామి దర్శకత్వంలో తమిళ భాషలో తెరకెక్కుతున్న చిత్రం ‘సండకోళి 2’. 2005లో సూపర్ హిట్ సాధించిన ‘సండకోళి’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతుంది ఈచిత్రం. ఇక ఈచిత్రం యొక్క ఆడియో వేడుక ఈ రోజు గ్రాండ్ గా జరుగనుంది. తెలుగులో ఈ చిత్రం ‘పందెంకోడి 2’పేరుతో విడుదలకానుంది. ఇక ఈచిత్రం తమిళ, తెలుగు భాషల్లో కలిపి సుమారు 2000 ల స్క్రీన్ లలో విడుదలకానుంది.

ఈచిత్ర తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు భారీ ధరకు దక్కించుకున్నారు. పక్క కమర్షియల్ ఎంటర్టైనెర్ గా రానున్న ఈచిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించింది. ఇక చాలా రోజుల తరువాత ‘అభిమన్యుడు’ చిత్రంతో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్నిఅందుకొని తెలుగులో తన మార్కెట్ ను పెంచుకున్నాడు విశాల్.

Exit mobile version