సందీప్ కిషన్ కొత్త సినిమా విడుదల తేది ఖరారు !

మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా మారి తెరకెక్కిస్తోన్న సినిమా మనసుకు నచ్చింది. సందీప్ కిషన్ – అమైరా దస్తూర్ హీరో, హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా లో . త్రిదా చౌదరి మరో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటివల విడుదల చేసిన ఈ సినిమా టిజర్ కు మంచి ఆదరణ లభించింది.

మనసుకు నచ్చింది చిత్రం జనవరి 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో మంజుల కూతురు జాన్వీ నటించడం విశేషం. ఫీల్ గుడ్ లవ్ స్టోరి తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో సూర్య విజయం సాధించడం ఖాయమని దర్శకురాలు మంజుల తాజా ఇంటర్వ్యూ లో తెలియజేసారు.