టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుమంత్ ప్రభాస్ హీరోగా ఆనంతిక సనీల్ కుమార్ హీరోయిన్ గా దర్శకుడు వేణు గోపాల్ రెడ్డి తెరకెక్కించిన లేటెస్ట్ రోమ్ కామ్ చిత్రమే ‘రోమాంచకం’. డీసెంట్ బజ్, ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా వసూళ్లు కూడా అలానే అందుకుంది. ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా థియేటర్స్ నుంచి ఓటీటీ లోకి అందుబాటులోకి వచ్చేసింది.
ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో సినిమా నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఒరిజినల్ తెలుగు సహా పాన్ ఇండియా డబ్బింగ్ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ సినిమా సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే తన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
