సందీప్ రెడ్డి “యానిమల్” సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే!

Published on Nov 19, 2021 10:00 pm IST

అర్జున్ రెడ్డి చిత్రం తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరక్టర్ సందీప్ రెడ్డి వంగా. సందీప్ రెడ్డి వంగా ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో సైతం రీమేక్ చేసి హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. సందీప్ రెడ్డి వంగా మేకింగ్ స్టైల్ కి భారీగా ఆఫర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సందీప్ మాత్రం బాలీవుడ్ హ్యాండ్సం హీరో అయిన రన్ బీర్ కపూర్ తో యానిమల్ అంటూ ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రం విడుదల కాకముందే, ప్రభాస్ తో మరొక సినిమా ప్రకటించారు సందీప్. అయితే ఈ ప్రకటన తో రన్ బీర్ కపూర్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది చాలామందికి ప్రశ్న గా మారింది. తాజాగా ఈ చిత్రం విడుదల పై ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం ఆగస్ట్ 11, 2023 వ తేదీన విడుదల కానున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ చిత్రం ను చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. అయితే ప్రభాస్ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :