సందీప్ వంగ, రణబీర్ ల సాలిడ్ ప్రాజెక్ట్ “యానిమాల్” షూట్ ఆరంభం.!

Published on Apr 22, 2022 4:40 pm IST


తన ఫస్ట్ సినిమా తోనే భారీ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాతో తాను మాత్రమే కాకుండా రౌడి హీరో విజయ్ దేవరకొండ కూడా ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తుండగా సందీప్ కూడా ఇదే అర్జున్ రెడ్డి ని హిందీలో తీసి సెన్సేషనల్ హిట్ ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ “యానిమల్” అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పుడు మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు.

ఈ సినిమా షూటింగ్ మరియు ఫార్మల్ పూజా కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చెయ్యగా హిమాలయాస్ లో ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసినట్టు తెలిపారు. మరి అలాగే ఈ సినిమా ని కూడా భారీ పాన్ ఇండియా సినిమా గానే తెరకెక్కిస్తుండగా దక్షిణాది భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా హీరోయిన్ గా ఫిక్స్ కాగా ఈ భారీ సినిమాకి టి సిరీస్ వారు మరియు భద్రకాళి పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది ఆగస్ట్ 22న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :