సంగీత్ శోభన్ ‘రాకాస’కి సాలిడ్ ఓటీటీ డీల్!?

Raakaasaa

మెగా వారసురాలు నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమానే “రాకాస”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ సినిమా నుంచి వచ్చిన టీజర్ గ్లింప్స్ ఇంప్రెస్ చేసింది. మంచి క్వాలిటీ విజువల్స్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా కోసం ఇపుడు ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా టీజర్ రాకముందే ఈ సినిమా తాలూకా ఓటీటీ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి అలాంటి సంస్థ ఎందుకు తీసుకుంది అనేది టీజర్ తో రివీల్ అయ్యింది. మరి వారు ఈ సినిమాకి మంచి మొత్తమే ముట్టజెప్పారట. లేటెస్ట్ బజ్ ప్రకారం కేవలం ఓటీటీ హక్కులు గానే ఈ సినిమాకి 10 నుంచి 11 కోట్ల మధ్య డీల్ లాక్ అయ్యిందట.

దీనితో ఈ సినిమా విడుదలకి ముందే మంచి టేబుల్ ప్రాఫిట్స్ చూసేలా ఉందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు అలాగే ఈ ఏప్రిల్ 3న థియేటర్స్ లో సినిమా విడుదల కాబోతోంది.

Exit mobile version