రవిబాబు ‘అవును 2’లో సంజన.!

Sanjana

హర్షవర్ధన్ రాణే, పూర్ణ జంటగా విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన చిత్రం ‘అవును’. 2012లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్ ఇప్పుడు తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రారంభమైన ‘అవును2’లో మొదటి పార్ట్ లో నటించిన హీరో, హీరోయిన్లు ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం రవిబాబు సంజనని తీసుకోనున్నాడు. ‘ఇటీవలే ఓ ఇన్సిడెంట్ లో రవిబాబు గారు నన్ను అసలు గుర్తించలేదు. నేను నా గురించి చెప్పగానే సర్ప్రైస్ అవ్వడమే కాకుండా తన అవును 2 సీక్వెల్ లో ఓ కీలక పాత్ర కోసం ఓ హీరోయిన్ కోసం చూస్తున్నానని చెప్పడమే కాకుండా ఆ రోల్ ని నాకు ఆఫర్ చేసారని’ సంజన తెలిపింది. ‘అవును 2’ సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ షూటింగ్ పూర్తవుతుంది. ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Exit mobile version