“కేజీయఫ్ 2” కి తన ఫైనల్ పార్ట్ ముగించేసిన అధీరా.!

Published on Dec 7, 2021 3:00 pm IST

ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి సిద్ధం అవుతున్న పలు సౌత్ ఇండియన్ భారీ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. దీనికి మొదటి చిత్రం చాప్టర్ 1 కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు సెట్ చేసుకొని ఉంది.

మరి ఈ చిత్రంలో రాకీ ని ఎదుర్కొనే మోస్ట్ పవర్ ఫుల్ పాత్ర అధీరా లా చేసిన బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఆసక్తికర పోస్ట్ పెట్టడం జరిగింది. మరి ఈ సినిమాకి గాను తన ఫైనల్ వర్క్ మొత్తం డబ్బింగ్ ని కంప్లీట్ చేసేసినట్టుగా దర్శకుడు నీల్ తో ఫొటోస్ పెట్టి తెలిపారు. వచ్చే ఏప్రిల్ 14 ఈ చిత్రాన్ని చూసేందుకు రెడీగా ఉండాలని సూచించారు. ఇప్పటికే తన లుక్స్ తో మేకర్స్ సంచలనం రేపారు. ఇక బిగ్ స్క్రీన్ పై ఇద్దరి స్టార్ నటుల ఫైర్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :