లేటెస్ట్ : సంజు భాయ్ ఖాతాలో మొత్తం మూడు సౌత్ సినిమాలు ?

Published on Mar 11, 2023 10:00 pm IST

బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ హీరోగా అలానే విలన్ గా పలు సినిమాలు చేస్తూ ఆడియన్స్, ఫ్యాన్స్ నుండి విశేషమైన క్రేజ్ తో ప్రస్తుతం కొనసాగుతున్నారు. అభిమానులు ముద్దుగా ఆయనని సంజు భాయ్ అని పిలుస్తుంటారు. ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన భారీ పాన్ ఇండియన్ మూవీ కెజిఎఫ్ చాప్టర్ 2లో ఆయన పోషించిన అధీరా పాత్రకి విపరీతమైన పేరు లభించింది. ఇక ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ తో లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ మూవీ లియో లో కీలక పాత్ర చేస్తోన్న సంజయ్ దత్, మరోవైపు ప్రభాస్ తో మారుతీ రూపొందిస్తోన్న మూవీలో కూడా ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు.

అలానే ఇవి రెండు మాత్రమే కాకుండా అతి త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న భారీ మాస్ యాక్షన్ మూవీలో కూడా సంజు భాయ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. మరి అది కనుక నిజం అయితే సంజు భాయ్ చేతిలో మొత్తంగా మూడు బడా సౌత్ సినిమాలు ఉన్నట్లే. మరి ఈ సినిమాలు కెరీర్ పరంగా ఆయనకు ఎంత మేర విజయాలను అందిస్తాయి అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :