స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ !

మొదటి సినిమా ఘాజి తో మంచి విజయం అందుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. రెండో సినిమాకు రంగం సిద్దం చేస్తున్నాడు. మెగా హీరో వరుణ్ తేజ్ తో ఈ డైరెక్టర్ మూవీ చెయ్యబోతున్నాడన్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్.

తాజా సమాచారం మేరకు డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకు సంభందించిన పూర్తి స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేశాడంట. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో చెయ్యబోయే ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకేక్కబోతోంది. ‘ఘాజి’ సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ డైరెక్టర్ ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ నిరూపించుకోబోతున్నాడు. వరుణ్ తేజ్ తాజాగా నటించిన ‘తొలిప్రేమ’ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తరువాత సంకల్ప్ సినిమా ప్రారంభంకానుంది.