మూడు రోజుల్లోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్రేక్ ఈవెన్.. ఎక్కడంటే?

మూడు రోజుల్లోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్రేక్ ఈవెన్.. ఎక్కడంటే?

Published on Jan 16, 2025 11:39 PM IST

విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా పూర్తి ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకు పండుగ అడ్వాంటేజ్ కలిసిరావడంతో థియేటర్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ దుమ్ములేపుతుంది.

ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో అదనపు షోలు, థియేటర్లు యాడ్ చేస్తూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీకి ట్రెమండస్ రెస్పాన్స్ తీసుకొస్తున్నారు. కాగా, ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను కూడా స్టార్ట్ చేసింది ఈ మూవీ. గుంటూరు, సీడెడ్ ప్రాంతాల్లో ఈ మూవీ 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవడంతో ఈ చిత్రానికి ఎలాంటి క్రేజ్ నెలకొందో అర్థం చేసుకోవచ్చు. మరి మున్ముందు ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు