ఒకే డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుంచి ‘సంక్రాంతి’ మూడు సినిమాలూ..

ఒకే డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుంచి ‘సంక్రాంతి’ మూడు సినిమాలూ..

Published on Dec 9, 2024 12:00 AM IST

మన తెలుగు సినిమా దగ్గర అతి పెద్ద సినిమా పండుగ సమయం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా కొత్త ఏడాది మొదటి పండుగ సంక్రాంతి సమయమే అని చెప్పాలి. ఈ పండుగ తోనే బాక్సాఫీస్ యుద్ధం పలు చిత్రాలు నడుమ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ రానున్న 2025 సంక్రాంతికి కూడా సాలిడ్ సినిమాలు మన స్టార్స్ నుంచి ప్యాకెడ్ గా ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. అయితే యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రాలలో మూడూ కూడా ఒకే డిస్ట్రిబ్యూషన్ నుంచి మొదలు కావడం గమనార్హం.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ ల భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” అలాగే బాలయ్య, కొల్లి బాబీల మాస్ చిత్రం “డాకు మహారాజ్” లని తీసుకొస్తున్నట్టుగా ఆల్రెడీ శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారు కన్ఫర్మ్ చేసారు. మరి లేటెస్ట్ గా ఇదే డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుంచి వెంకీ మామ, అనీల్ రావిపూడిల “సంక్రాంతికి వస్తున్నాం” కూడా రిలీజ్ అవుతున్నట్టుగా లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు. దీనితో ఆల్రెడీ ఉన్న మూడు సినిమాలూ కూడా వీరి నుంచే రిలీజ్ కాబోతుండడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు