సంక్రాంతి హీట్..ఈ రెండు భారీ సినిమాల్లో ఒకటేనా.?

Published on Sep 29, 2021 7:59 am IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలను ఆదరించిన విధంగా మరెక్కడా కూడా ఆదరించరు థియేటర్స్ కి జనం పరిగెత్తేవాళ్లు అనేది మళ్ళీ ఈ లాక్ డౌన్ 2.0 తర్వాత ప్రూవ్ అయ్యింది. అందుకే మన దగ్గర సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ.. అయితే ఇక పండుగ రేస్ వచ్చింది అంటే హంగామా మరింత హీటెక్కడం ఖాయం. ఆ పండుగలలో కొత్త ఏడాది అతిపెద్ద పండుగ సంక్రాంతి కూడా ఒకటి.

మరి ఈ రేస్ లో ఆల్రెడీ మన స్టార్ హీరోల సినిమాలు భీమ్లా నాయక్, సర్కారు వారి పాట లు డేట్స్ ఫిక్స్ చేసుకోగా ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యామ్ కూడా ఫిక్స్ అయ్యింది. అయితే ఆల్రెడీ అనౌన్స్ చేయబడ్డ సినిమాలు ఇవి. ఇక ఇది పక్కన పెడితే మరో భారీ పాన్ ఇండియన్ సినిమా “RRR” కూడా ఈ రేస్ లోనే విడుదల అవుతుంది అని చాలా గట్టి టాక్ నే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తుంది.

దీనితో ఇది కనుక ఫిక్స్ అయితే సంక్రాంతి రేస్ లో రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ “RRR” లేదా ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్” రెండిట్లో ఒకటే ఉంటుందట. ఏదో ఒకటి షిఫ్ట్ అవ్వడం ఖాయం అని తెలుస్తుంది. మరి దీనిపై ఎప్పుడు ఒక క్లారిటీ వస్తుందో అన్నది ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :