పాతికేళ్ల సంక్రాంతి సీన్ రిపీట్.. ‘విక్టరీ’ మాత్రం ఆయనదే!

పాతికేళ్ల సంక్రాంతి సీన్ రిపీట్.. ‘విక్టరీ’ మాత్రం ఆయనదే!

Published on Jan 21, 2025 4:00 PM IST

సంక్రాంతి పండుగ సీజన్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సినిమాలు పోటీ పడుతుండటం కామన్. అయితే, కొన్ని సినిమాలు హిట్ అవుతుంటాయి.. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి. ఇదే సీన్ ఈసారి సంక్రాంతి సందర్భంగా మనం చూశాం. జనవరి 10న రిలీజ్ అయిన రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, జనవరి 12న నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, జనవరి 14న విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్ అయ్యాయి. ఇక ఈ మూడు సినిమాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓవరాల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

అయితే, ఇదే తరహా సీన్ గతంలో రిపీట్ అయ్యింది. 2000 సంవత్సరంలోనూ సంక్రాంతి బరిలో ముగ్గురు హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి ‘అన్నయ్య’ జనవరి 7న.. నందమూరి బాలకృష్ణ ‘వంశోద్ధారకుడు’, వెంకటేష్ ‘కలిసుందాం రా’ చిత్రాలు జనవరి 14న రిలీజ్ అయ్యాయి. ఈ మూడింటిలోనూ ‘కలిసుందాం రా’ మూవీ ఓవరాల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఇలా పాతికేళ్ల తర్వాత కూడా ఓ మెగా హీరో, నందమూరి హీరో సినిమాలకు పోటీగా దిగిన వెంకటేష్ తన ‘విక్టరీ’ని కంటిన్యూ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు