సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన చిత్రాల్లో విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. పూర్తి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఏకంగా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సత్తా చాటింది.
అయితే, ఈ సినిమా అందుకున్న భారీ విజయాన్ని సెలిబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ బ్లాక్‌బస్టర్ సంబరం చేసుకునేందుకు తేదీ, వేదికను ప్రకటించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి సంబంధించిన బ్లాక్‌బస్టర్ సంబరం వేడుకలను భీమవరంలో జరుపుకునేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ సినిమాలో అందాల భామ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రొడ్యూస్ చేశారు.