టాలీవుడ్‌లో లేటెస్ట్ సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ కావడంతో జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా పండుగ ముగిసినా హౌజ్‌ఫుల్ షోలతో సందడి చేస్తోంది.
ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కళ్లుచెదిరే వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరగా, తాజాగా ఈ చిత్రం మరో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ మార్క్‌ను చేరుకుంది. దీంతో ఈ సినిమాను రిలీజ్ చేసిన నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో వెంకటేష్ సరసన అందాల భామలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రొడ్యూస్ చేశారు.