టాలీవుడ్‌లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన చిత్రాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఒకటి. అయితే, మిగతా రెండు చిత్రాలు ‘డాకు మహారాజ్’, ‘గేమ్ ఛేంజర్’లతో పోల్చితే ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఇదే తరహా రెస్పాన్స్ కనిపిస్తోంది.
ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూస్తే అవాక్కవ్వాల్సిందే. వింటేజ్ వెంకటేష్ చిత్రాల తరహాలోనే ఈ మూవీకి కూడా ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ఏకంగా మిలియన్ డాలర్ క్లబ్‌లోకి అడుగు పెట్టింది. దీంతో ఈ సినిమాకు అక్కడ ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైనింగ్ కథతో ఈ సినిమా తెరకెక్కగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రొడ్యూస్ చేశారు.