పాత రోజుల్లోకి తీసుకెళ్లేలా వెంకీ మామ, రమణ గోగుల సాంగ్ ప్రోమో

పాత రోజుల్లోకి తీసుకెళ్లేలా వెంకీ మామ, రమణ గోగుల సాంగ్ ప్రోమో

Published on Nov 30, 2024 6:30 PM IST

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి అలాగే యంగ్ అండ్ టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమే “సంక్రాంతికి వస్తున్నాం”. మరి మంచి బజ్ ని సంతరించుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ అయితే సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని ఊరిస్తూ వస్తున్నారు.

అయితే ఇది ఒకింత స్పెషల్ కాగా వింటేజ్ సంగీత దర్శకుడు గాయకుడూ రమణ గోగులతో ఫస్ట్ సింగిల్ మేకర్స్ ప్లాన్ చేశారు. మరి ఈ సాంగ్ నుంచి ప్రోమో రిలీజ్ చేయగా రమణ గోగుల వాయిస్ లోని మ్యాజిక్ తో మళ్ళీ పాత రోజుల్లోకి తీసుకెళ్లిపోయేలా ఉందని చెప్పాలి. గోదారి గట్టు అంటూ సాగే ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ ని డిసెంబర్ 3 న తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా సినిమాని దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు