‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ చూశారా!

‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ చూశారా!

Published on Jan 21, 2025 11:00 PM IST

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తుంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా పూర్తి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కళ్లు చెదిరే వసూళ్లను రాబడుతోంది.

ఈ మూవీకి అన్నిచోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్ అయిన తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.203 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి దుమ్ములేపింది. ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రానికి ఈ స్థాయిలో వసూళ్లు వస్తుండటం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది.

ఇక ఈ సినిమాలో అందాల భామలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా భీమ్స్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు