నార్త్ అమెరికాలో సూపర్ స్ట్రాంగ్ గా “సంక్రాంతికి వస్తున్నాం”

నార్త్ అమెరికాలో సూపర్ స్ట్రాంగ్ గా “సంక్రాంతికి వస్తున్నాం”

Published on Jan 18, 2025 8:00 AM IST

ఈసారి టాలీవుడ్ సంక్రాంతి బరిలో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన “సంక్రాంతికి వస్తున్నాం” కూడా ఒకటి. మరి టైటిల్ కి తగ్గట్టుగానే సంక్రాంతి రేస్ లో వచ్చి సెన్సేషనల్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది.

కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకొని అదరగొట్టిన ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది. ఇలా నార్త్ అమెరికాలో లేటెస్ట్ గా ఈ చిత్రం 1.4 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని క్రాస్ చేసినట్టుగా డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. దీనితో 2 మిలియన్ మార్క్ ని కూడా ఈ చిత్రం ఈజీగా దాటేలా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు, శిరీష్ లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు