సాలిడ్ ధరకి “సంక్రాంతికి వస్తున్నాం” నాన్ థియేట్రికల్ హక్కులు!

సాలిడ్ ధరకి “సంక్రాంతికి వస్తున్నాం” నాన్ థియేట్రికల్ హక్కులు!

Published on Jan 16, 2025 4:01 PM IST

లేటెస్ట్ గా సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన టాలీవుడ్ చిత్రాల్లో వెంకీ మామ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం”. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ అటెన్షన్ ని అందుకున్న ఈ చిత్రం వారి అంచనాలు అందుకొని థియేటర్స్ లో ఇపుడు అదరగొడుతుంది.

మరి థియేటర్స్ పరంగా మంచి బిజినెస్ అంతకు మించిన వసూళ్లు అందుకుంటున్న ఈ చిత్రం ఇపుడు నాన్ థియేట్రికల్ హక్కుల విషయంలో కూడా అదరగొట్టినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఓటిటి సహా శాటిలైట్ హక్కులు జీ సంస్థ సొంతం చేసుకున్నారు. అంటే స్ట్రీమింగ్ జీ 5 లో అయితే టెలికాస్ట్ జీ తెలుగు సంస్థలో కానుంది. మరి ఈ మొత్తానికి 27 కోట్లు మేర ధర పలికినట్టుగా తెలుస్తుంది. దీనితో సంక్రాంతికి వస్తున్నాం ఇలా కూడా మంచి బిజినెస్ ని చేసింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు