సంక్రాంతి రేస్ లో వెంకీ మామ బొమ్మ సెన్సేషన్!

సంక్రాంతి రేస్ లో వెంకీ మామ బొమ్మ సెన్సేషన్!

Published on Jan 14, 2025 7:00 AM IST

మన టాలీవుడ్ సినిమా దగ్గర అతి పెద్ద సినీ పండుగ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా సంక్రాంతి రేస్ అనే చెప్పాలి. ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ మొత్తం మూడు సినిమాలు ఉండగా ఆల్రెడీ రెండు సినిమాలు గేమ్ ఛేంజర్ అలాగే డాకు మహారాజ్ లు రిలీజ్ అయ్యాయి.

ఇక ఈ సినిమా తర్వాత తెలుగు ఆడియెన్స్ మెయిన్ గా ఫ్యామిలీ సెక్షన్ ఎదురు చూస్తున్న సినిమా “సంక్రాంతికి వస్తున్నాం”. వెంకీ మామ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో ప్లాన్ చేసిన ఈ సెన్సేషనల్ సినిమా ఈ సంక్రాంతి బరిలో భారీ బుకింగ్స్ ని నమోదు చేస్తూ ఫస్ట్ ఛాయిస్ గా నిలిచింది.

రిలీజ్ కి ముందే బుక్ మై షోలో 4 లక్షలకు పైగా టికెట్స్ బుక్ చేసుకొని ఈ సినిమా సెన్సేషన్ ని సెట్ చేసినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఇలా మొత్తానికి సంక్రాంతి రేస్ లో ఈ సినిమా హవా మాత్రం మామూలు లెవెల్లో లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు