టాలీవుడ్‌లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాల్లో కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ పట్టం కడుతున్నారు.
దీంతో ఈ మూవీ కళ్లుచెదిరే వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుండటంతో ఈ మూవీ ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా తాజాగా 200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ఈ స్థాయి వసూళ్లు సాధించిన ఫాస్టెస్ట్ మూవీగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ రికార్డు సెట్ చేసింది. అంతేగాక, తెలుగు రీజనల్ చిత్రాల్లో ఈ మార్క్‌ను అందుకున్న ఫాస్టెస్ట్ మూవీగా ఇది ఆల్ టైమ్ రాకార్డును క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ఈ కలెక్షన్ల మోత ఇప్పట్లో ఆగేలా లేదని పలువురు సినీ ఎక్స్‌పర్ట్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేయగా శిరీష్ ప్రొడ్యూస్ చేశారు.