7వ రోజు కూడా ఆగని కలెక్షన్ల ప్రవాహం !

7వ రోజు కూడా ఆగని కలెక్షన్ల ప్రవాహం !

Published on Jan 20, 2025 4:01 PM IST

విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా ఏపీ & తెలంగాణలో 6వ రోజు 12.5 కోట్ల+ షేర్ తో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు 7వ రోజు అనగా నేడు సోమవారం నాడు ఓపెనింగ్స్ కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయని.. సినిమాకి భారీ స్థాయిలోనే టికెట్లు బుక్ అయ్యాయని లేటెస్ట్ రిపోర్ట్స్ ను బట్టి తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకి హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయట. పైగా మధ్యాహ్నం షోస్ కూడా ఫుల్ అయ్యాయట.

మొత్తానికి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది ఈ సినిమా. నిజానికి ప్రీమియర్ నుంచి, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబడుతూనే ఉంది. కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మొత్తమ్మీద భారీ విజయాన్ని సాధించింది. మొదటి నుండి ఈ సినిమా ప్రమోషన్లు ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ ను క్రియేట్ చేశాయి. దీంతో, టికెట్ బుకింగ్‌లు నేటికీ భారీగానే బుక్ అయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు