స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ పూర్తి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది.
ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకుల థియేటర్లకు క్యూ కడుతుండటంతో, ఈ సినిమా ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.300 కోట్ల మార్క్ టార్గెట్‌గా దూసుకెళ్తోంది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరుపుకుంటోంది చిత్ర యూనిట్. తాజాగా చెన్నైలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ యూనిట్ సక్సెస్ పార్టీ జరుపుకున్నారు.
ఈ పార్టీలో చిత్ర యూనిట్‌తో పాటు మరికొందరు సినీ స్టార్స్ పాల్గొన్నారు. ఇక ఈ సెలబ్రేషన్స్‌లో అనిల్ రావిపూడి, హీరోయిన్లు మీనాక్షి, ఐశ్వర్య రాజేష్ కేక్ కట్ చేసి ఎంజాయ్ చేశారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రొడ్యూస్ చేశారు.
View this post on Instagram