ఓవర్సీస్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ స్పీడు మాములుగా లేదుగా!

ఓవర్సీస్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ స్పీడు మాములుగా లేదుగా!

Published on Jan 20, 2025 7:00 PM IST

విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తూ ఈ మూవీతో మరో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాను థియేటర్లలో ప్రేక్షకులు పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీ్స్‌లో సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది.

కేవలం అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే వంటి దేశాల్లోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ దుమ్ములేపుతోంది. ఈ చిత్రానికి అక్కడి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు వస్తున్నాయి. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఇప్పటికే 350K డాలర్ల వసూళ్లు రాబట్టింది. అటు యూకే బాక్సాఫీస్ వద్ద 200K పౌండ్లు వసూళ్లు రాబట్టింది.

ఇలా అమెరికాతో పాటు ఇతర దేశాల్లోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రెమండస్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుండటం విశేషం. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా భీమ్స్ సంగీతం అందించారు. దిల్ రాజు సమర్పణల శిరీష్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు