‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్లు ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ ను క్రియేట్ చేశాయి. దీంతో, టికెట్ బుకింగ్‌లు అద్భుతంగా ప్రారంభమయ్యాయి, బుక్‌మైషోలో మాత్రమే ఇప్పటికే రెండు లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. రేపు థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి. పైగా విక్టరీ వెంకటేష్ – కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో రాబోతున్న కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ సినిమా. అన్నిటికి మించి సంక్రాంతి స్పెషల్ గా రాబోతుంది.
ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విషయానికి వస్తే.. ముక్కోణపు క్రైమ్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ఆయన భార్యగా ఐశ్వర్య, మాజీ ప్రేయసిగా మీనాక్షి నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి అందిస్తున్నారు.