ఓవర్సీస్ లో సంక్రాంతి హిట్ సినిమాల కలెక్షన్ల వివరాలు !
Published on Jan 19, 2017 9:33 am IST

khaidi-gpsk-shatamanm
ఈ సంక్రాంతికి విడుదలైన ‘ఖైదీ నెం 150, గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి’ మూడు చిత్రాలు భారీ విజయాలుగా నిలిచి రికార్డ్ కలెక్షన్లను సాదిస్తూ 2017 కి తెలుగు పరిశ్రమకు గొప్ప ఆరంభాన్నిచ్చాయి. ఓవర్సీస్ లో సైతం ఈ మూడు చిత్రాలు మంచి టాక్ తెచ్చుకుని కళ్ళు చెదిరే కలెక్షన్లను సాధిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ మూడు చిత్రాలు యూఎస్ బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టిన కలెక్షన్ల వివరాలు చూస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.

మొదట ‘ఖైదీ నెం 150’ కలెక్షన్ల విషయానికొస్తే మొదటిరోజు $1296K సాధించిన ఈ సినిమా సోమవారం $68K, మంగళవారం $44K రాబట్టి ఇప్పటి దాకా $2.21M (రూ.15.10 కోట్లు) వసూలు చేసింది. ఇక బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మొదటి రోజు $376K రాబట్టి సోమవారం $93.5K , మంగళవారం $68K వసూలు చేసి మొత్తంగా $1.44M(రూ. 9.87 కోట్లు) చేసి హాఫ్ మిలియన్ కు దగ్గరపడింది. అలాగే మూడవ చిత్రం ‘శతమానంభవతి’ సంగతి చూస్తే మొదటి రోజు $47K కొల్లగొట్టిన ఈ చిత్రం సోమవారం $61.7K, మంగళవారం $43.5K సాధించి హాఫ్ మిలియన్ $525 K (రూ. 3.58 కోట్లు) కు చేరింది.

 
Like us on Facebook