సీడెడ్ లో “సంక్రాంతికి వస్తున్నాం” హవా.. 11 రోజుల్లో సాలిడ్ వసూళ్లు!

సీడెడ్ లో “సంక్రాంతికి వస్తున్నాం” హవా.. 11 రోజుల్లో సాలిడ్ వసూళ్లు!

Published on Jan 25, 2025 9:00 PM IST

ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చి అదరగొట్టిన లేటెస్ట్ చిత్రాల్లో వెంకీ మామ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కూడా ఒకటి. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతుండగా ఇపుడు సినిమా 11 రోజులు రన్ ని కంప్లీట్ చేసుకొని భారీ వసూళ్లు అందుకుంది.

అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలన నంబర్స్ అందుకుంటున్న ఈ చిత్రం సీడెడ్ మార్కెట్ లో కూడా ఊచకోత చూపిస్తుంది. ఇలా అక్కడ ఈ 11 రోజుల్లోనే భారీ మొత్తం 17.2 కోట్ల షేర్ ని రాబట్టి అదరగొట్టినట్టుగా పిఆర్ లెక్కలు చెబుతున్నాయి. ఇక ఈ రెండో వారాంతం కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఉండబోతుంది అన్నట్టుగా కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం హవా మాత్రం ఓ రేంజ్ లో నడుస్తుంది అని చెప్పాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు