సంతోష్ శోభన్ ‘లైక్ షేర్ & సబ్ స్క్రైబ్’ ఒటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

సంతోష్ శోభన్ ‘లైక్ షేర్ & సబ్ స్క్రైబ్’ ఒటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Dec 1, 2022 11:13 PM IST


యువ నటుడు సంతోష్ శోభన్ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లైక్ షేర్ & సబ్ స్క్రైబ్. ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్ సంస్థలపై వెంకట్ బోయిన్ పల్లి ఎంతో గ్రాండ్ గా నిర్మించిన ఈ రొమాంటిక్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ కి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల సంగీతం అందించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ తరువాత మాత్రం ఆశించిన స్థాయి సక్సెస్ ని అందుకోలేకపోయింది.

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీని డిసెంబర్ 9 న ప్రముఖ ఒటిటి మాధ్యమం సోని లివ్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ ముందుకి రానుంది. కొద్దిసేపటి క్రితం ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చింది. మరి థియేటర్స్ లో పెద్దగా ఆకట్టుకోని లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ మూవీ ఓటిటి లో ఎంతమేరకు మెప్పిస్తోందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు