సప్తగిరి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ !
Published on Nov 22, 2017 6:36 pm IST

సప్తగిరి కథానాయకుడిగా వచ్చిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ మంచి విజయం సాధించింది. తాజాగా సప్తగిరి ‘సప్తగిరి ఎల్ ఎల్ బి’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మద్య విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టిజర్, ఫస్ట్ సాంగ్ మంచి ఆదరణ పొందాయి. నూతన దర్శకుడు చరణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు.

ఈ సినిమాను సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత నిర్మాత డా. రవికిరణ్‌ నిర్మిస్తోన్నాడు. డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్నా ఈ సినిమా చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ప్రస్తుతం చెన్నైలో రీరికార్డింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ను డిసెంబర్ 7 న విడుదల చెయ్యనున్నారు. సాయికుమార్‌గారు ఈ మూవీలో కీలకమైన లాయర్‌ పాత్రలో నటించారు.

 
Like us on Facebook