ఎన్టీఆర్ – పూరి సినిమాలో సప్తగిరి కామెడీ.

saptha-giri
ఇటివల విడుదలైన ‘లవర్స్’ సినిమాలో మగజాతి ఆణిముత్యంగా సప్తగిరి చేసిన పిచ్చి కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. నెల్లూరు యాసలో డైలాగులు చెప్తూ.. తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఈ హాస్య నటుడుకి పెద్ద అవకాశం లభించింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో సప్తగిరి నటిస్తున్నాడు. సప్తగిరి మీద స్పెషల్ కామెడీ ట్రాక్ రాశారట పూరి. ఈ సినిమా సప్తగిరి కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు.

ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ సెప్టెంబర్ 10 నుండి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

Exit mobile version