ప్లాప్స్ పై హీరోయిన్ మనసులో మాట

ప్లాప్స్ పై హీరోయిన్ మనసులో మాట

Published on Jun 24, 2024 8:38 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె ‘సారా అలీ ఖాన్’ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఐతే, ఆమెకు ఆశించిన స్థాయిలో హిట్లు దక్కడం లేదు. ఈ క్రమంలో తన మూడో చిత్రం ‘లవ్‌ ఆజ్‌కల్‌’ ఆశించినంతగా విజయం సాధించకపోవడంపై సారా తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ‘నా సినీ కెరీర్‌ అప్పుడప్పుడే మొదలైంది. మూడో సినిమా బాగా పరాజయం పాలైంది. ఆ సినిమా ఫ్లాప్‌ కావడానికి నేనూ ఓ కారణం. అందులో నేను చేసిన జో పాత్రను అంచనా వేయడంలో పొరపాటు చేశానేమో’ అని సారా అలీఖాన్‌ చెప్పుకొచ్చింది.

సారా అలీఖాన్‌ ఇంకా తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘సినిమాలు కొన్నిరకాల ఒత్తిళ్లు, కొందరి సలహాతో ఒప్పుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ప్లాప్స్ కూడా వస్తాయి. ఒక్కటి మాత్రం నిజం. మన మనసుకు నచ్చిందే చేయాలి.. ఎవరి మాటా వినొద్దు అని నాకు ఇప్పుడు అర్థమైంది’ అంటూ ఆమె చెప్పింది. సారా అలీఖాన్‌ ప్రస్తుతం ‘మెట్రో ఇన్‌ దినో’, ‘స్కై ఫోర్స్‌’ సినిమా చిత్రీకరణలతో బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు