‘పెద్ది’ విజయం తర్వాత కొంత విరామం తీసుకున్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, తన నెక్స్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘RC17’ కోసం సిద్ధమవుతున్నాడు. ఇటీవల సర్జరీ పూర్తిచేసుకుని కోలుకున్న ఆయన, ఈ సినిమాలో కొత్త లుక్ కోసం ప్రత్యేకంగా ట్రెయినింగ్ పొందుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధమవ్వగా, ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇక దసరాకు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించి, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేపట్టేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రామ్ చరణ్ సరసన ‘ధురందర్’ భామ సారా అర్జున్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ భామ పేరు వినిపించినా, మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.
అయితే, ఇప్పుడు సుకుమార్ వినిపించిన కథ ఎంతో నచ్చడంతో ఆమె ఈ అవకాశానికి వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ లేదా శాశ్వత్ సచ్‌దేవ్‌లలో ఒకరు సంగీతం అందించే అవకాశముందని తెలుస్తోంది. మరి ‘ధురంధర్’ భామ ఈసారైనా ఈ సినిమాకు ఫైనల్ అవుతుందో లేదో చూడాలి.
