టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్‌ను పులుమార్లు వాయిదా వేశారు.
అయితే, ఇప్పుడు ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 18న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. అయితే, ఓ స్టార్ హీరోయిన్ నటించిన సినిమా కూడా అదే రోజున రిలీజ్ కావాల్సి ఉంది. స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న ‘ఘాటి’ చిత్రం ఏప్రిల్ 18న రిలీజ్ అవుతుందని గతంలో చిత్ర యూనిట్ వెల్లడించింది. కానీ, ఇప్పుడు కొన్ని వర్క్స్ బ్యాలెన్స్ ఉండిపోవడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడనుందని తెలుస్తోంది.
మరి నిజంగానే అనుష్క శెట్టి ‘ఘాటి’ రిలీజ్ డేట్ మారనుందా.. అందుకే ‘సారంగపాణి జాతకం’ అదే రోజున రిలీజ్ అవుతుందా.. అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.