శరత్ బాబు గారి హెల్త్ పై ఆయన సోదరి లేటెస్ట్ రిపోర్ట్

Published on May 3, 2023 11:31 pm IST


తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడిగా ఎన్నో సినిమాల్లో పలు అద్భుతమైన పాత్రలు పోషించిన శరత్ బాబు మనందరికీ ఎంతో సుపరిచితం. నాటి ఎన్టీఆర్ గారి దగ్గరి నుండి నేటి అనేకమంది యువ నటుల సినిమాల్లో సైతం ఆయన కీలక పాత్రలు పోషించి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. అయితే కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబుకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. కాగా నేడు ఆయన మరణించారు అంటూ కొద్దిసేపటి క్రితం నుండి పలు మీడియా మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.

అయితే ఆయన హెల్త్ పై తాజాగా అయన సోదరి లేటెస్ట్ రిపోర్ట్ అందించారు. సోషల్ మీడియా లో శరత్ బాబు గారి గురించి వార్తలు అన్ని తప్పుగా వస్తున్నాయి. ప్రస్తుతం శరత్ బాబు కొంచెం రికవరీ అయ్యారు, ఆయనను వేరొక రూమ్ కి డాక్టర్లు షిఫ్ట్ చేయడం జరిగింది. తొందరలోనే శరత్ బాబు గారు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడుతారు అని ఆశిస్తున్నాను. దయచేసి ఎవ్వరూ కూడా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఏవి నమ్మవద్దు అని నా విజ్ఞప్తి అంటూ ఆమె తెలిపారు.

సంబంధిత సమాచారం :