లహరి, షణ్ముఖ్‌ ల పై సరయూ వ్యంగ్యాస్త్రాలు !

Published on Sep 13, 2021 7:45 am IST


అందరూ ఊహించినట్లుగానే సరయూ వారం రోజులకే ఎలిమినేట్ అయింది. నామినేషన్‌ లో నిలిచిన ఆమె తక్కువ ఓట్లు కారణంగా హౌస్‌ నుంచి కన్నీళ్లతో నిష్క్రమించింది. ఈ సందర్భంగా సరయూ లహరి పై విరుచుకుపడింది. ‘ఏమీ లేని అరిటాకు ఎగిరెగిరి పడుతుందట’ అని పరుషంగా మాట్లాడుతూ ‘అంత ఈగో ఏంటి నీకు ? ఆ టోన్‌ మార్చుకో, ఎదగడానికి మనుషులను తొక్కాల్సిన అవసరం లేదు’ అంటూ లహరి పై సరయూ సీరియస్ అయింది.

అలాగే షణ్ముఖ్‌ పై కూడా సరయూ విమర్శలు చేసింది. ‘అరేయ్‌ ఏంట్రా ఇది? బయటే అనుకుని ఇలా రావొద్దురా అంటూ వెటకారంగా అతని పై రెచ్చిపోయిన సరయూ.. చివరకు అతనికి ఒక సలహా ఇస్తూ.. ‘అయినా సిరిని లేపాక నువ్వు లేద్దామని అనుకుంటున్నావా? అని ఓ వ్యంగ్యాస్త్రాన్ని కూడా వదిలింది. ఇక కాజల్‌ ను వరస్ట్‌ కంటెస్టెంట్ గా తేల్చి పడేసింది. మొత్తానికి తనదైన శైలిలో కొంతమందికి షాక్ ఇచ్చి వెళ్ళిపోయింది.

సంబంధిత సమాచారం :