బిగ్‌బాస్ ఓటిటి: అఖిల్-అషు రిలేషన్‌పై సరయు సెన్సేషనల్ కామెంట్స్..!

Published on Mar 29, 2022 12:04 am IST

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో అప్పుడే ఐదో వారంలోకి అడుగుపెట్టింది. మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో లో మొదటి వారం వారియర్స్ నుంచి ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఛాలెంజర్స్ నుంచి శ్రీరాపాక, మూడో వారం వారియర్స్ నుంచి ఆర్జే చైతూ, నిన్న సరయు ఎలిమినేట్‌ అయ్యారు. ఇక ఎప్పటిలాగానే ఎలిమినేషన్ అనంతరం యాంకర్ రవికి ఇచ్చిన బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో సరయు కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది.

బిగ్‌బాస్ షో అంటేనే పెద్ద గబ్బు షో అని ఇందులో లవ్ ట్రాక్‌లు పెట్టి.. ప్రతి సీజన్‌కి ఒకటి రెండు జంటల్ని బకరాలను చేస్తుంటారని చెప్పుకొచ్చింది. ఈ ఓటీటీ సీజన్‌లో కూడా లవ్ ట్రాక్‌‌లు మొదలయ్యాయని చెప్పింది. బోల్డ్ బ్యూటీ అషురెడ్డి అఖిల్‌కి అంటిపెట్టుకునే కనిపిస్తుందని, అఖిల్‌ని హౌస్‌లో ఎవరైనా చిన్న మాట అన్నా సరయు ఎగిరిపడుతుందని, అసలు ఆమె బిగ్‌బాస్ గేమ్ ఆడటానికి వచ్చిందో లేక అఖిల్ కోసం వచ్చిందో తెలియదు కానీ.. అఖిల్ కోసమే అషు అన్నట్టుగా వరస్ట్ గేమ్ ఆడుతోందని సరయు కామెంట్స్ చేసింది.

సంబంధిత సమాచారం :