సర్ధార్, ప్రిన్స్ చిత్రాల నైజాం కలెక్షన్స్!

సర్ధార్, ప్రిన్స్ చిత్రాల నైజాం కలెక్షన్స్!

Published on Oct 31, 2022 2:00 PM IST

కార్తి హీరోగా రాశి ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్స్ గా పీఎస్ మిత్రన్ తెరకెక్కించిన సెన్సేషనల్ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ సర్ధార్. ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం సర్ధార్ చిత్రం నైజాం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది. నైజాంలో సెకండ్ వీక్ లో మూడో రోజు 40 లక్షలు నెట్ ను కలెక్ట్ చేసింది. ఇక ఇప్పటివరకు నైజాంలో మొత్తం రూ.4.8 కోట్ల నెట్ ను వసూళ్లు చేసింది.

అలాగే, శివ కార్తికేయన్ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ప్రిన్స్. ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్కా హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ప్రిన్స్ చిత్రానికి నైజాం బాక్సాఫీస్ వద్ద వస్తున్న కలెక్షన్ల పరిస్థితి చూద్దాం. నైజాంలో సెకండ్ వీక్ లో మూడో రోజు 7 లక్షలు నెట్ ను కలెక్ట్ చేసింది. ఇక ఇప్పటివరకు నైజాంలో మొత్తం రూ.1.9 కోట్ల నెట్ ను వసూళ్లు చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు