వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సర్దార్…ఎప్పుడంటే?

Published on Feb 5, 2023 9:00 am IST

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా, డైరెక్టర్ పి.ఎస్ మిత్రన్ డైరెక్షన్ లో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్. ఈ చిత్రం గతేడాది థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

ఫిబ్రవరి 11, 2023 న జీ సినిమాలు లో ఈ చిత్రం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. రాశి ఖన్నా, రజిష విజయన్, చుంకి పాండే, లైలా లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :