‘సర్దార్ గబ్బర్ సింగ్’ గుజరాత్ షెడ్యూల్ మొదలైంది

sardat
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు రెండేళ్ళుగా తమ హీరో సినిమా కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఆయన తాజాగా నటిస్తోన్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోని ఎనర్జిటిక్ క్యారెక్టరైజేషన్‌ను బేస్ చేసుకొని సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రూపొందుతోంది. పవర్ సినిమాతో మెప్పించిన దర్శకుడు బాబీ, పవన్ సర్దార్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈమధ్యే హైద్రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఓ ఐటమ్ సాంగ్‌ను పూర్తి చేసిన యూనిట్ తాజాగా ఓ షెడ్యూల్ కోసం గుజరాత్‌లో లాండ్ అయింది.

గుజరాత్‌లో పదిరోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో పలు యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కించనున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని సినిమా యూనిట్ చెబుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, ఓ చిన్న టీజర్ ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేయగా సినిమా అభిమానులకు పండగే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు శరత్ మరార్ నిర్మాత.

Exit mobile version